Maheshbabu-trivikram movie | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో మహేష్-త్రివిక్రమ్ ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇప్పటికీ ఈ రెండు చిత్రాలు టీవీలో వస్తున్నాయంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. తినగా తినగా వేప తియ్యనుండు అనే విధంగా ఈ రెండు చిత్రాలు చూసిన ప్రతిసారి ఇంకా ఇంకా నచ్చుతూనే ఉంటాయి. ఇక దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి హ్యట్రిక్‌కు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మరో క్రేజీ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాలలో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే మహేష్ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం నందమూరి తారక రత్నను ఎంపిక చేశాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’ వంటి సినిమాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా మాత్రం నిలబడలేకపోయాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ట్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న నటులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ చిత్రంతో తారక రత్న కూడా బిజీ అవుతాడో చూడాలి మరి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు.