హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్.. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు షార్ట్‌లిస్ట్ అయిన విషయం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆ సాంగ్‌ను షార్ట్ లిస్ట్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ ఫిల్మ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది. నాటు నాటు సాంగ్.. ఆస్కార్స్ రేసులో నిలవడం పట్ల నటుడు రామ్‌చరన్ స్పందించాడు. తన ట్విట్టర్లో అతను రియాక్ట్ అయ్యాడు. యావత్ భారత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది చరిత్రాత్మక సందర్భమని రామ్‌చరణ్ అన్నాడు. అకాడమీ అవార్డులకు ఇండియన్ సాంగ్ షార్ట్‌లిస్టు కావడం ఇదే తొలిసారి అని, భారతీయ చిత్రసీమకు ఇంతకన్నా గొప్ప ఆదరణ ఉండదని రామ్‌చరణ్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డాడు. ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికే ఈ క్రెడిట్ దక్కుతుందని, ఇదంతా వాళ్ల విజన్, మ్యాజిక్ అని రామ్‌చరణ్ తన ట్వీట్లో తెలిపాడు.
What a historic moment for the entire Indian Film Industry… Couldn’t be more honoured to note that #NaatuNaatu becomes the first Indian song to be shortlisted for the Academy Awards! @ssrajamouli garu and @mmkeeravaani garu, it’s all your vision and magic..🙏❤️ #RRRForOscars pic.twitter.com/hdJuce16Zl
— Ram Charan (@AlwaysRamCharan) December 22, 2022
95వ అకాడమీ అవార్డులకు తుది నామినేషన్లను జనవరి 24వ తేదీన ప్రకటిస్తారు. మార్చి 12వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్స్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీలో గుజరాతీ చిత్రం ఛల్లో షోతో పాటు డాక్యుమెంటరీ ఫీచర్లో ఆల్ దట్ బ్రీత్స్, డాక్యుమెంటరీ షార్ట్ క్యాటగిరీలో ద ఎలిఫెంట్ విష్పర్స్ .. ఇండియా తరపున అకాడమీ నామినేషన్స్ రేసులో ఉన్నాయి.