Naa Saami Ranga | సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. గతేడాది పొంగల్ ఫెస్ట్‌లో ఐదు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాగా.. ఈ ఏడాది కూడా నాలుగు భారీ సినిమాలు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. అయితే ఇందులో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్ డివైడ్ టాక్ తెచ్చుకోగా ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇదిలావుంటే.. అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామి రంగ. విజయ్ బిన్ని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ చూసుకుంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన నాగార్జున అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎక్స్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. కింగ్ నాగార్జున అక్కినేని టైటిల్ కార్డ్‌తోనే ఆకట్టుకున్నారని డిజైన్ అద్భుతంగా అంటున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ అంచనాలను మించి పోయింది. చాలా కాలం తర్వాత నాగార్జునకు ఓ భారీ హిట్ పడింది. అల్లరి నరేష్ కూడా ర్యాంప్ ఆడించాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కీరవాణి మ్యూజిక్ అదిరిపోయిందని తెలియజేస్తున్నారు. నాగ్ ఐకానిక్ మూమెంట్ సైకిల్ చైన్ సీన్ రిఫరెన్స్ కూడా ఈ సినిమాలో ఉందని నెటిజన్లు తెలుపుతున్నారు.
K-I-N-G size title card 🥵🤌👑🔥 #NaaSaamiRanga pic.twitter.com/qahV5bIkKe
— Tom Bhayya 🇮🇳 (@Tom_Bhayya_Here) January 14, 2024
Done with first half
Rammppp anthe 💥🔥💯Simple story but execution was lit #NaaSaamiRanga #NagarjunaAkkineni pic.twitter.com/Qmr4j8laIv
— Nippu Nagaraju (@NippuNagaraju_) January 14, 2024
#NaaSaamiRanga Review :
BELOW AVERAGE FIRST HALF ✅
18+ Content LoveStory – Bad VFX – Low Budget Feel 💯💯💯💯#AkkineniNagarjuna
— GetsCinema (@GetsCinema) January 14, 2024
Just Now Complete Movie… 🔥
Perfect Sankranti Entertainment Movie.. 👌👌👌
Family ki Baga Conect Avuthadhi… 🫰#NaaSaamiRanga pic.twitter.com/mdRJdHmhZq— VENKATESH 🇮🇳 (@kanakam1234) January 14, 2024
#NaaSaamiRanga started on high note with packed House Fulls
Benifit shows all over Andhra Pradesh 💥💥
If the inside reports are to be believed, this film will be most promising amongst all Sankranthi releases. pic.twitter.com/IC5LQ3LvgP
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) January 14, 2024
విజయ్ బిన్నీ(Vijay Binny) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్(Raj tharun) ముఖ్య పాత్రలు కనిపించగా.. ఆషికా రంగనాథ్(Ashika Ranganath), మిర్నా మీనన్(Mirna Menon), రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాడు.