Bellamkonda Srinivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కావ్య రెడ్డితో కలిసి ఆయన ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుక ఏప్రిల్ 29న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది. ఇక వివాహం అనంతరం శ్రీనివాస్ తన సోషల్ మీడియా వేదికగా భార్యను పరిచయం చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ శ్రీనివాస్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అయిన ‘జయ జానకి నాయక’లోని ఐకానిక్ డైలాగ్‌ను క్యాప్షన్‌గా పెట్టారు.
“నేను నిర్మించుకున్న సామ్రాజ్యం మధ్యలో, అంతకంటే గొప్పదైన ఒక నిధిని కనుగొన్నాను. ప్రపంచమా.. ఈమె నా భార్య కావ్యమ్మా, కావ్య బెల్లంకొండ. ‘నా పెళ్ళాం నిప్పురా’ (Na Pellam Nippura) అంటూ బెల్లంకొండ రాసుకొచ్చాడు. తన భార్యపై ఉన్న ప్రేమని తనదైన మాస్ స్టైల్లో వ్యక్తపరచడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించింది ఈ జంట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సినీ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాలు ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.
In the midst of everything I’ve built, I found something far greater. World, meet my wife. #Kavyaamma #kavyabellamkonda
NA PELLAM NIPPU RA 🔥#Sreenivasakavyanam pic.twitter.com/S7dLxBeqtq
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 1, 2026