‘డ్రాగన్’ షూటింగ్లో ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఆగస్ట్‌లో ఆయనకు సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం తారక్ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. దాంతో ‘డ్రాగన్’ సినిమా అనుకున్న డేట్‌కి విడుదల కావడం కష్టమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వస్తున్న విమర్శలపై నిర్మాతల్లో ఒకరై
స్పందించారు.
‘డ్రాగన్’ని అనుకున్న డేట్లోనే కచ్చితంగా విడుదల చేస్తామని, మరో రెండు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని, ఫిబ్రవరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తిచేస్తామని రవిశంకర్ తెలిపారు. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే ఉద్వేగపూరితమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రుక్మిణీ వసంత్, అనిల్‌కపూర్, బిజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.