Mythri Movies Makers | శ్రీమంతుడు సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movies Makers). ఎంట్రీతోనే తెలుగు సినీ పరిశ్రమకు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా అందించింది. ఆ తర్వాత ఈ బ్యానర్లో జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప.. ది రైజ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది బాలకృష్ణతో వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ టాప్ బ్యానర్‌కు సంబంధించిన క్రేజీ వార్త ఫిలింనగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ తొలి మలయాళ సినిమా షూటింగ్ నేడు మొదలైంది. మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తోన్న ఈ చిత్రానికి నడికర్ థిలకమ్ (Nadikar Thilakam) టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని గాడ్స్పీడ్ అఫీషియల్ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సూపర్ ఎక్జయిటెడ్ ప్రాజెక్ట్‌ని డ్రైవింగ్ లైసెన్స్ ఫేం సౌబిన్ సాహిర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అత్యంత ప్రతిభావంతులైన మలయాళ సూపర్‌స్టార్ టోవినో థామస్‌తో సినిమాచేయడం పట్ల చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంది.. అంటూ మేకర్స్ షేర్ చేసిన లాంఛింగ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం అల్లు అర్జున్ టైటిల్ రోల్లో పుష్ప.. ది రైజ్ సీక్వెల్‌గా వస్తున్న పుష్ప.. ది రూల్ తెరకెక్కిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి, పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్, NTR31 , RC16, VNR Trio, RT4GM సినిమాలున్నాయి.
Super excited and delighted for our project with the supremely talented Malayalam superstar @ttovino and @soubinshahir ❤🔥#NadikarThilakam shoot begins ❤️
Helmed by the blockbuster director of #DrivingLicense #LalJr 💥
Co- Produced by @godspeedoffcl. pic.twitter.com/XrLbON5WtZ
— Mythri Movie Makers (@MythriOfficial) July 12, 2023