Actor Ajith | తెలుగు టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movies Makers) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్టు అందించింది. ఇక ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ఇక ఈ టాప్ బ్యానర్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ (RaviTeja), గోపీచంద్ మలినేనిల కాంబోతో పాటు.. మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas)తో అదృశ్య జలకంగల్ (Adrishya Jalakangal ) సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇవే కాకుండా పుష్ప 2తోపాటు పలు సినిమాలు ఈ బ్యానర్ ఖాతాలో ఉన్నాయి.
అయితే ఈ బ్యానర్‌కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్లో ఫర్రే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్ టోవినో థామస్ (Tovino Thomas) అదృశ్య జలకంగల్ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యానర్ మరో టాప్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ బ్యానర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో సినిమా ప్లాన్ చేస్తుందని సమాచారం. దీనికి అజిత్ కూడా ఒకే చెప్పినట్లు టాక్. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగు నుంచి అయిన తమిళం నుంచి అయిన ఓ స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది.