Dhurandhar | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ రంగంలోనూ అదే జోరు కోనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు భారీ చిత్రాలను పంపిణీ చేసి హిట్ అందుకున్న ఈ నిర్మాణ సంస్ధ తాజాగా మరో బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు అదిత్య ధర్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar). ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఇదే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రణవీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు.