Kona Seema Thugs Movie | టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్‌లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్‌లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది కాస్త డల్ అయినట్లు కనిపించినా ఈ సంక్రాంతితో మళ్లీ పుంజుకుంది. ఇక సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోలను దింపి 91ఏళ్ళ టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రొడక్షన్ సంస్థ చేయని సాహసం చేసింది. అంతేనా.. స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి మరీ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి విజయభేరి మోగించింది. రోజు గ్యాప్‌తో రిలీజైన వీరసింహా, వాల్తేరు సినిమాలు మైత్రీకి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.
అయితే ఇటీవలే రిలీజైన అమిగోస్ తేడాకొట్టింది. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దాంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే నటుడిగా మాత్రం కళ్యాణ్‌రామ్ వంద మార్కులు కొట్టేశాడు. అయితే ఈ సినిమాకు ఎక్కువగా బిజినెస్ జరగకపోవడంతో.. ఆ నష్టం మైత్రీపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక మైత్రీ సంస్థ నిర్మాణమే కాదు డిస్ట్రిబ్యూషన్లోనూ దూసుకుపోవాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తుంది.
కొనసీమ థగ్స్ అనే సినిమాను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. అయితే రిలీజ్ రోజున చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన మైత్రీకి గిట్టుబాటు అవుతుంది. జైలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో బాబీ సింహా కీలకపాత్ర పోషిస్తున్నాడు. కరుడు గట్టిన రౌడీలంతా ఒక జైల్లో కలుసుకుంటారు. ఊచల వెనుకు ఉన్నా బయట దందా నడిపించడంతో చేయి తిరిగిన ఈ గుండాల బ్యాచ్ అంతా జైలు నుంచి తప్పించుకుపోవడానికి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? పోలీసుల కళ్లుగప్పి ఆ రౌడీలు తప్పించుకున్నారా? అనే అంశాలతో కోనసీమ థగ్స్ తెరకెక్కింది.
స్టోరీలైన్ వింటె పెద్ద గొప్పగా ఏమి లేదు. ఇదివరకు విన్నది, చూసింది లానే ఉంది. పైగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా అస్సలు ఒంటబట్టదు. కేవలం యూత్ మాత్రమే ఈ సినిమాను సేవ్ చేయగలరు. ఇప్పటి వరకైతే మైత్రీ ప్రమోషన్స్ పెద్దగా సినిమాపై బజ్ క్రియేట్ చేయలేదు. మరీ ఆదివారం జరిగే ప్రీ-రిలీజ్ వేడుకతోనైనా కాస్త బజ్ క్రియేటవుతుందో చూడాలి. అమిగోస్ వంటి దెబ్బ తగిలిన తర్వాత వెంటనే ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం మైత్రీ కాస్త రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తుంది.