Mythri Movie Makers | టాలీవుడ్లో ఉన్న లీడింగ్ ఇండస్ట్రీలలో ఒకటి పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. ఇటీవలే కోలీవుడ్ మూవీ డ్యూడ్ సినిమాతో ఖాతాలో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకుంది. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంటూ.. దీపావళి వీకెండ్‌కు ప్రేక్షకులకు ఫస్ట్ చాయిస్ మూవీగా నిలుస్తోంది.
మంచి ప్రేమకథలతో హిట్స్ అందిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. డెబ్యూ డైరెక్టర్లకు అవకాశమిస్తూనే వారికి బిగ్గెస్ట్ హిట్స్ అందిస్తోంది. భరత్ కమ్మ, బుచ్చిబాబు సాన తర్వాత డ్యూడ్ సినిమాతో కీర్తిశ్వరన్కు డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందిచింది మైత్రీ మూవీ మేకర్స్.
డియర్ కామ్రేడ్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు భరత్ కమ్మ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్టాక్ మూటగట్టుకున్నా.. కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా బాగా కనెక్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చాలా మంది మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు. ఇక బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేసిన చిత్రం ఉప్పెన. తొలి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు బుచ్చిబాబు.
తాజాగా కీర్తిశ్వరన్కు డ్యూడ్ సినిమాతో డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ కూడా ఎంట్రీతోనే కీర్తిశ్వరన్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ డ్యూడ్ సినిమా సక్సెస్‌తో ఓవర్‌నైట్ కీర్తిశ్వరన్ను తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా నిలిపింది. ఈ మూవీ సక్సెస్‌తో రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.