Vijay Deverakonda | విజయ్ దేవరకొండపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ‘రణబాలి’ నిర్మాత
Ranabali | నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చుట్టూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది.
Vijay Deverakonda | నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చుట్టూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. షూటింగ్ సెట్స్‌లో విజయ్ దేవరకొండ తన కోసం 5 నుంచి 6 కారవాన్లు, 40-50 మంది అసిస్టెంట్లను డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించారంటూ కొన్ని నకిలీ స్క్రీన్షాట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ తప్పుడు ప్రచారంపై చిత్ర నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ స్పందించారు. విజయ్ దేవరకొండ చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని, షూటింగ్లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ టీమ్ కూడా ఇవి కావాలనే చేస్తున్న తప్పుడు ప్రచారాలని, వీటిని సృష్టించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక ‘రణబాలి’ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. 1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలన నాటి వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ‘ది మమ్మీ’ సినిమా విలన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో ప్రధాన విలన్‌గా నటిస్తుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

