Superstar Rajinikanth | అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన తదుపరి చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నటుడు, నిర్మాత కమల్ హాసన్ బ్యానర్లోనే తన తదుపరి సినిమా ఉంటుందని రజనీకాంత్ తెలిపారు. దీంతో, దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించబోతున్నారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవర్ ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని పాలక్కడ్‌లో జరుగుతుండగా.. ఈ షూటింగ్లో జాయిన్ అవ్వడానికి రజనీ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళుతుండగా.. అక్కడ మీడియాతో ముచ్చటించాడు. అయితే మీడియా రజనీని తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అడుగగా.. రజనీ మాట్లాడుతూ..
నా తదుపరి చిత్రం రాజ్ కమల్ బ్యానర్లో చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కమల్, నేను కలిసి నటిస్తే చూడాలని చాలామంది ఆశపడుతున్నారు. మేము కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు కథ సెట్ అయినప్పుడు కలిసి నటిస్తాం. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి కథ, దర్శకుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దీనిపై త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం అంటూ రజనీ చెప్పుకోచ్చాడు.
#Thalaivar press meet before leaving to Palakkad for #Jailer2 shoot . ❤️
“ My next movie with RKFI and Red Giants . Even I wish to act with Kamal . Still story characters and director not finalised “#Rajinikanth | #SuperstarRajinikanth | #Superstar @rajinikanth pic.twitter.com/XReupfNSO8
— Suresh Balaji (@surbalu) September 17, 2025