ప్రతిష్టాత్మక మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కిన మ్యూజికల్ లవ్ ఆల్బమ్ ‘మై లవ్’. కిశోర్ తేజా, సాత్విక జంటగా నటించిన ఈ సాంగ్‌ని ఎస్.కె.టి. ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై వాకాడ అప్పారావు నిర్మించారు. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను, క్రాంతి ఆచార్య స్వరపరచగా, కపిల్ కపిలన్ ఆలపించారు.
మ్యూజికల్ లవర్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఈ పాట ఉంటుందని, యువజంట కిశోర్ తేజా, సాత్విక స్క్రీన్ కెమిస్ట్రీ లవ్లీగా ఉంటుందని, రామ్‌రెడ్డి పన్నాలా అద్భుతమైన కాన్సెప్ట్‌తో హార్ట్ టచ్చింగ్‌గా ఈ పాటను మలిచారని శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకర్స్ తెలిపారు.