Sushmitha Konidela | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అయితే సాహు గారపాటి నిర్మాణంలో వస్తున్న మరో చిత్రం కిష్కిందపురి. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుధవారం జరుగగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన సుష్మిత కొణిదెల మన శంకరవరప్రసాద్ గారు సినిమా సెట్స్‌లోని ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
అమ్మ అంటే నాన్న(చిరు)కి కొంచెం అయిన భయం ఉంటుంది అంటారా అని యాంకర్ సుమ సుష్మితని అడుగగా.. సుష్మిత మాట్లాడుతూ.. ఈరోజే భయపడ్డాడు. మన శంకరవరప్రసాద్ గారు సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. మా అమ్మ వచ్చింది షూట్ చూడటానికి. అయితే అప్పటివరకు బానే చేసిన నాన్న అమ్మని చూడగానే తడబడ్డాడు. స్టెప్పులని మర్చిపోయాడు అంటూ చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.