హైదరాబాద్: తండ్రీ కొడుకుల పరస్పర ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీలో రచ్చ కొనసాగుతూనే ఉన్నది. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ (Manchu Manoj) కుట్ర చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ పోలీసులకు మోహన్‌బాబు చేసిన ఫిర్యాదుపై.. తాజాగా మనోజ్ స్పందించారు. ‘నా తండ్రి ఆరోపణలు చాలా బాధ కలిగించాయి. నాపై, నా భార్య మౌనికపై దురుద్దేశపూరిత ఆరోపణలు చేశారు. అవన్నీ అవాస్తవాలు. నా పరువు తీసి.. గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు చేశారు. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమే. మేము స్వయంగా ఉపాధి పొందుతూ స్వతంత్రంగా ఉన్నాం. నేనెప్పుడూ ఆర్థిక సాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. నేను ఏడాది నుంచి మా నాన్న ఇంట్లో ఉంటున్నా.
నా సోదరుడు దుబాయ్ వెళ్లాక మా అమ్మ ఒంటరిగా ఉంది. నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. నాలుగు నెలల క్రితం దురుద్దేశపూర్వకంగా వెళ్లానని ఆరోపించారు. నన్ను, నా భార్యను ఇరికించే ఉద్దేశంతో ఫిర్యాదు చేశారు. నేను ఆ ఇంట్లో ఉన్నట్లు ధ్రువీకరించాలని అధికారులను కోరుతున్నా. నా ఫోన్ టవర్ లొకేషన్ ధ్రువీకరించాలని అభ్యర్థిస్తున్నా. నా 7 నెలల కుమార్తెను వివాదంలోకి లాగడం అమానవీయం. నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించడం దురదృష్టకరం. మా నాన్న దుర్భాషలతో ఇంట్లో పనివారు కూడా భయపడతారు. అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నాకు తగిలిన గాయాలకు చికిత్స కోసమే దవాఖానకు వెళ్లా. ఏం దాచడానికి యత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరిపించాలి. నేనెప్పుడూ వారసత్వ ఆస్తుల కోసం అడగలేదు. ఆస్తులు అడిగి ఉంటే సాక్ష్యాలు ఇవ్వాలని సవాల్ చేస్తున్నా.
ఎంబీయూ విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. విష్ణు, ఆయన సహచరులు వినయ్, మహేశ్వర్ ద్వారా దోపిడీ జరుగుతున్నది. ఆర్థిక అక్రమాలు, దోపిడీకి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. వాటిని అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నా.’ అంటూ మంచు మనోజ్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచుటౌన్ షిప్లో తాను పదేండ్లుగా నివాసముంటున్నాని మోహన్‌బాబు తన ఫిర్యాదులో తెలిపారు. తన చిన్న కొడుకు మనో జ్, కోడలు మౌనిక అనుచరులతో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తన 7 నెలల కూతురిని వదిలేసి మ నోజ్ అతని భార్య బయటకు వెళ్లిపోతార ని, ఆ పాపను ఇంట్లో పనిచేసే మహిళనే సంరక్షకురాలిగా ఉంటుందని వెల్లడించా రు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇం ట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చే యాలంటూ భయపెట్టారని పేర్కొన్నారు. తన ఆస్తులను కాజేసేందు కు మనోజ్ కుట్ర చేస్తున్నారని, తనకు ప్రా ణహాని ఉందని, తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ నెల 8వ తేదీన ఉదయం సమయం లో గుర్తుతెలియని పది మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి అరుపులు, కేకలు వేశారని, అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. దవాఖానలో చికిత్స చేయించుకున్నా నని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.