VarunTej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారంపై ఆయన సోదరి, నటి నిహారిక కొణిదెల ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘రాకాస’ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆమె, తన అన్నయ్య తన ప్రేమను ఎంత రహస్యంగా కాపాడుకున్నారో వివరిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
‘మా అన్నయ్య ప్రేమ విషయం నాకు మొదటి నుంచీ అస్సలు తెలియదు. వారిద్దరూ దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నా, ఆ విషయాన్ని కనీసం నా దగ్గర కూడా పొక్కనివ్వలేదు. వరుణ్ అన్నయ్య పుట్టినరోజు వేడుకలకు లావణ్య రావడం చూసినప్పుడు నాకు మొదటిసారి అనుమానం కలిగింది. సాధారణంగా అన్నయ్యకు హీరోయిన్లలో స్నేహితులు చాలా తక్కువ. అలాంటిది తను మా ప్రైవేట్ బర్త్‌డే పార్టీకి ప్రత్యేక్షమవ్వడంతో.. వీరి మధ్య ఏదో సీరియస్ మేటర్ ఉందని నాకు అప్పుడే అర్థమైంది’ అని నిహారిక చెప్పుకొచ్చారు. ఇక వరుణ్ తేజ్ తన వ్యక్తిగత విషయాలను ఇంత గోప్యంగా ఉంచడంపై నిహారిక ప్రశంసలు కురిపిస్తూ.. మా అన్నయ్య నిజంగా గ్రేట్! అంత కాలం ఎవరికీ తెలియకుండా, మీడియా కంట పడకుండా అంత సీక్రెట్‌గా ఉంచడం అనేది చాలా పెద్ద విషయం అంటూ కొనియాడింది.