Thaman Balakrishna Combo | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు థమన్‌కి కాస్ట్లీ లగ్జరీ కారు గిప్ట్గా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన గత నాలుగు చిత్రాలు (అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్) సినిమాలకు థమన్ సంగీతం అందించడంతో పాటు బాలయ్యకు సూపర్ హిట్లను అందించాడు. దీంతో అతడికి రూ.1.75 కోట్ల విలువ చేసే లగ్జరీ పోర్చే కారును బహుమతిగా అందించాడు.
అయితే ఈ కారు బహుమతిగా ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడాడు బాలయ్య. నందమూరి థమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు (అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్) హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతోందంటూ చెప్పుకోచ్చాడు బాలయ్య. మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో త్వరలో ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు.
Nandamuri #Balakrishna gifted a luxurious Porsche car to music director #Thaman@MusicThaman #NBK#jmediafactory pic.twitter.com/cKLz0U8Znu
— JMediaFactory (@JMedia_Factory) February 15, 2025