కె.సుధాకర్‌రెడ్డి, అరుణ్‌రాజ్, పూర్ణచంద్ర, మౌనిక బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డు విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకుడు. వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మాతలు. త్వరలో ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ఈ సినిమాలోని పాటను అగ్ర కథానాయిక సమంత చేతుల మీదుగా విడుదల చేశారు.
‘అరవైల పడుసోడు.. ఎగిరెగిరి పడతాడు.. తుమ్మాకో తంబాకో తెలవదులేండి..’ అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రాయగా, కార్తీక్ రోడ్రిగ్వ్ స్వరపరిచారు. విద్యాసాగర్ బంకుపల్లి ఆలపించారు. ముత్తయ్య పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాటను రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు.
దివాకర్‌మణి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తూ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటకృష్ణ, నిర్మాణం: హైలైఫ్ ఎంటైర్టెన్మెంట్స్ ప్రై.లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటైర్టెన్మెంట్స్ ఎల్ఎల్పి.