Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నుంచి హర్షవర్ధన్ రమేశ్వర్ అవుట్?.. లైన్లోకి తమన్!
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK47) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (AK47) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ తప్పుకోగా, ఆ స్థానంలోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి తొలుత ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రమేశ్వర్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలుస్తుంది. సృజనాత్మక విభేదాల వలనో లేదా డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలనో హర్షవర్ధన్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం.
ఇక హర్షవర్ధన్ తప్పుకోవడంతో, త్రివిక్రమ్ తన ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్. తమన్‌ను రంగంలోకి దించారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్ కావడంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే తమన్‌తో కలిసి త్రివిక్రమ్ సరికొత్త మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 2న (గాంధీ జయంతి సందర్భంగా) విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

