Music Shop Murthy | టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటిస్తుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి (Harsha Garapati) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ నుంచి ట్రైలర్‌ను వదిలారు మేకర్స్.
ట్రైలర్ గమనిస్తే.. గుంటూరులో ఒక మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు 50 ఏండ్ల మూర్తి (అజయ్ ఘోష్). అయితే కాలం మారి యువత టెక్నాలజీకి అలవాటు పడడంతో తన మ్యూజిక్ షాప్‌కు జనాలు రావడం మానేస్తారు. ఈ క్రమంలోనే తనకి డీజే ఆపరేటర్ అవ్వాలని కోరిక పుడుతుంది. అయితే ఆ విషయం ఇంట్లో తన భార్యకి చెప్పిన, బయట స్నేహితులకు చెప్పిన ఈ వయసులో డీజే ఏంటి అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం మూర్తి ఏమి చేశాడు అనేది సినిమా స్టోరీ. చాలా రోజుల తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్‌తో అజయ్ ఘోష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు సహా నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.