తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘మ్యాజిక్ మూమెంట్స్’. ‘మీరు అనుకున్నది కాదు’ అనేది ఉపశీర్షిక. ఏకదంతాయ సిరి కథానాయిక. ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకుడు. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ‘మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్‌తోపాటు డివోషనల్ టచ్ కూడా ఉన్న సినిమా ఇది.
అందరి సహకారంతో ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాను. షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే సినిమాను మీ ముందుకు తెస్తాం.’ అని తెలిపారు. పనిచేసిన వారందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని చిత్ర సమర్పకులు దశరథ్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.