‘పదేళ్లుగా కలిసున్న స్నేహితులందరం కలిసి పనిచేసిన సినిమా ‘సత్యభామ’. కాజల్ టైటిల్‌రోల్ చేస్తుంది అనగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది ఆమెకు పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను’ అని సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అన్నారు. కాజల్ ప్రధానపాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల విలేకరులతో ముచ్చటించారు. ‘ఓ పోలీస్ ఆఫీసర్ ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. ఇందులోని ట్విస్ట్‌లు, టర్న్‌లు ఊహించని రీతిలో ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ డూప్ లేకుండా చేసింది కాజల్. ఆమెలోని స్పిరిట్ చూసి ప్రేరణ పొంది మ్యూజిక్ అందించాను.
థ్రిల్లర్, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ‘సత్యభామ’ బాగా నచ్చుతుంది’ అన్నారు శ్రీచరణ్ పాకాల. ‘ఇందులో మొత్తం అయిదు పాటలు ఉంటాయి. కాజల్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో వచ్చే ‘వెతుకు వెతుకు..’ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు. నా లైఫ్‌లో గుర్తుండిపోయే పాట ఇది. అలాగే.. కాజల్, నవీన్‌చంద్రపై తీసిన ‘కళ్లారా చూశాలే..’ సాంగ్ యూత్‌ని విశేషంగా అలరిస్తుంది’ అని ఆయన తెలిపారు.