ఇటీవలే విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప-2’ చిత్రంలోని టైటిల్‌సాంగ్‌తో పాటు జాతర పాటకు నృత్యరీతుల్ని సమకూర్చి అందరి ప్రశంసలందుకుంటున్నారు కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. తన కెరీర్లో ‘పుష్ప-2’ ఓ మైలురాయిలా నిలిచిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం విజయ్ పోలాకి విలేకరులతో మాట్లాడుతూ “కొబ్బరిమట్ట’ సినిమా ద్వారా నేను కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యాను.
ఆ తర్వాత ‘పలాస’ చిత్రంలో అన్ని పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశా. అందులో ‘నక్కిలీసు గొలుసు’ పాట చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత నా ప్రొఫైల్ చూసి సుకుమార్, అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావ’ పాట కోసం పిలిపించారు. నేను ఇచ్చిన రిహార్సల్స్ చూసి అవకాశమిచ్చారు. ఇక అక్కడి నుంచి కొరియోగ్రాఫర్‌గా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అన్నారు.
‘పుష్ప-2’లో జాతర సాంగ్ గురించి మాట్లాడుతూ ‘సుకుమార్ విజన్‌కు అనుగుణంగా పుష్పరాజ్ పాత్రను అర్థం చేసుకొని గంగమ్మ తల్లి జాతర సాంగ్‌ను కంపోజ్ చేశాను. ఛాయ్ గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, భుజాల మీద మంటతో సిగరెట్ ముట్టించుకోవడం…ఇవన్నీ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ ప్రకారం డిజైన్ చేశాను. నా చిన్నప్పుడు ఊర్లలో జరిగే జాతరలను బాగా గమనించేవాడిని. ఈ పాట విషయంలో ఆ పరిజ్ఞానం కూడా ఉపయోగపడింది’ అన్నారు.
తాను చిరంజీవికి పెద్ద అభిమానినని, అయితే డ్యాన్స్ మాస్టర్ కావాలనే కోరిక మాత్రం హీరో రామ్ పోతినేని నృత్యాలను చూడటం వల్లే కలిగిందని, ఈ రెండేళ్ల కాలంలో తాను కంపోజ్ చేసిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయని విజయ్ పోలాకి తెలిపారు. చిరంజీవితో పాటు అగ్ర హీరోలందరి సినిమాలకు పనిచేయాలన్నది తన డ్రీమ్ అని, ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ‘భైరవం’ ‘మ్యాడ్-2’ హిందీ బేబీ రీమేక్ సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నానని ఆయన చెప్పారు.