ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ సాథియా’. దివ్యా భావన దర్శకత్వంలో చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఓ సాథియా ఓ సాథియా’ అంటూ సాగే లిరికల్ వీడియోను సంగీత దర్శకుడు మణిశర్మ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినసొంపైన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా ఉంటుంది.
లిరికల్ వీడియోకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, జావెద్ అలీ ఆలపించారు. వైవిధ్యమైన ప్రేమకథగా రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.