ప్రకృతికి కాపాడేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రముఖుల భాగస్వామ్యంతో నిర్విరామంగా సాగుతున్నది. తాజాగా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జుబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మణిశర్మ తన కుమారుడు మహతి స్వరసాగర్కు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.