Music Channel | నలభయేళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న ఎమ్‌టీవీ పారామౌంట్ గ్లోబల్ ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత తమ అనుబంధ సంగీత ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో ‘ఎమ్‌టీవీ మ్యూజిక్’, ‘ఎమ్‌టీవీ 80స్’, ‘ఎమ్‌టీవీ 90స్’, ‘క్లబ్ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్’ తదితర ప్రసిద్ధ ఛానళ్లు ఉన్నాయి.ఎమ్‌టీవీ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా స్మార్ట్ఫోన్లు విస్తారంగా వాడడం, యూట్యూబ్, టిక్‌టాక్, స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్‌కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ కావడం, సంగీతం ప్రసారం చేసే ఛానళ్లకు ఆదరణ తగ్గిపోవడం అని పేర్కొంది. అయితే, రియాలిటీ షోలను ప్రసారం చేసే ఎమ్‌టీవీ హెచ్డీ ఛానల్ యధావిధంగా కొనసాగుతుందని యాజమాన్యం తెలిపింది.
ఇటీవల ఎమ్‌టీవీ పారామౌంట్ గ్లోబల్ సంస్థ స్కై డాన్స్ మీడియాతో విలీనమైంది, దీని వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణాలని వర్గాలు చెబుతున్నారు. 1981లో అమెరికాలో స్థాపించబడిన ఎమ్‌టీవీ ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.ఈ కొత్త పరిణామం, సంగీత ప్రియులకు పెద్ద షాకింగ్‌గా మారింది. ఒకప్పుడు సంగీత అభిమానులని ఉర్రూతలూగించిన ఈ సంస్థ ఇప్పుడు సడెన్‌గా ఇలా షట్ డౌన్ కానుందని తెలిసి మ్యూజిక్ ప్రియులు కూడా కాస్త నిరశ వ్యక్తం చేస్తున్నారు.
ఇక 2016లో ఎంటీవీ ఇండీస్ స్థానంలో ఎంటీవీ బీట్స్ అనే 24 సంగీత ఛానెల్ ప్రారంభం అయింది. అప్పటి నుండి ఎంటీవీ ఇండియా ఫోకస్ ప్రధానంగా రియాలిటీ షోలపై పెట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనిని కూడా క్లోజ్ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. పోలండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ దేశాలలో కూడా మ్యూజిక్ ఛానెల్స్ మూతపడుతున్నట్టు తెలుస్తుంది.