Murari Vaa Song Update | ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. భారీ అంచనాలతో మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే ‘ఎఫ్3’, ‘మేజర్’, ‘విక్రమ్’ వంటి సినిమాలు విడుదలవడంతో ‘సర్కారు వారి పాట’ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతో ‘మురారి వా’ అనే మెలోడియస్ సాంగ్‌ను యాడ్ చేశారు.
ఎడిటింగ్‌లో తొలగించిన ఈ పాటను ఇటీవలే థియేటర్ ప్రదర్శనలో యాడ్ చేశారు. తాజాగా ‘మురారి వా’ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మెలోడీ సాంగ్‌గా విడుదలైన ఈ పాటలో కీర్తి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మది కెమెరా విజువల్స్ బాగున్నాయి. ఇప్పటికే సినిమాలోని అన్ని వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.