Murari prequel | సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ఆల్ టైం క్లాసిక్ మురారి సినిమాను కృష్ణవంశీ సీక్వెల్ తీయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ కొడుకు గౌతమ్‌ను హీరోగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు.. మహేశ్ ఓకే అంటే ఇప్పుడు కథను రెడీ చేస్తానని కృష్ణవంశీ చెప్పినట్లే వార్తలు వస్తున్నాయి. ఇది చూసిన అభిమానులు కూడా సూపర్ కృష్ణవంశీ గారు తొందరగా కథను రెడీ చేసి మహేశ్ అన్నతో ఓకే చేయించండి కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా ఈ విషయంపై దర్శకుడు కృష్ణవంశీ స్పందించాడు. మురారి సీక్వెల్ అంటూ వస్తున్న వార్తలను నమ్మకండి అని అవి ఫేక్ అని సీక్వెల్ అంటూ లేదని తెలిపాడు. అయితే ఈ పోస్ట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. మురారి సినిమాకు సీక్వెల్ లేదన్నారు ఓకే.. కనీసం ప్రీక్వెల్ అయిన ఉందని అనుకొవచ్చా సర్ అంటూ పోస్ట్ చేయగా.. చల్లగా ఉండు అంటూ రిప్లయ్ ఇచ్చాడు కృష్ణవంశీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
There is no sequel plz 🙏 https://t.co/5p9L15u8zF
— Krishna Vamsi (@director_kv) August 16, 2024
Hahaha…🙏❤️ GOD BLESS https://t.co/MGmS3ets5J
— Krishna Vamsi (@director_kv) August 16, 2024
మహేశ్ కెరీర్లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటి మురారి(Murari). టాలీవుడ్ క్లాసికల్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మహేశ్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా టాలీవుడ్ నుంచి వచ్చిన ఆల్ టైం క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది. రీసెంట్గా ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 5.5 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.