Pritam Chakraborty Office Boy | ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి (Pritam Chakraborty) ఆఫీస్ బాయ్‌ని దొంగతనం కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆఫీస్‌లో రూ. 40 లక్షలు దొంగతనం జరిగినట్లు ఇటీవల ప్రీతమ్ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంట్లో సరుకులు ఇస్తానని చెప్పి తన ఆఫీస్ బాయ్ అయిన సాయల్ రూ.40 లక్షల సొమ్మున్న బ్యాగ్‌తో పరారయినట్లు ప్రీతమ్ ఫిర్యాదులో పేర్కోన్నాడు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణలో భాగంగా దాదాపు 200 సీసీటీవి కెమెరాలను పరిశీలించి సాయల్లో జమ్ము కాశ్మీర్లో పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ కేసు గురించి పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. దొంగతనం చేసిన అనంతరం సాయల్ ముంబై నుండి అమృత్ సర్కి విమానంలో వెళ్లి, అక్కడి నుండి బస్సులో కాశ్మీర్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. అయితే సాయల్ సమాచారం అందిన పోలీసులు అతడిని జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పట్టుకున్నారు. ఇక ఆశిష్ సాయల్ నుంచి ₹34 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.