ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ సూసైడ్ కేసులో.. బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(Sooraj Pancholi) నిర్దోషిగా తేలాడు. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ ఆ కేసులో తీర్పును వెలువరించింది. జియా ఖాన్(Jia Khan) ముంబైలోని జూహూ ఇంట్లో 2013, జూన్ 3న ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడు ఆమె వయసు 25 ఏళ్లు. సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ తర్వాత సూరజ్ పంచోలీని అరెస్టు చేశారు. ఐపీసీ 306 కింద పంచోలీపై కేసు బుక్ చేశారు. బాలీవుడ్ జంట ఆదిత్య పంచోలీ, జరీనా వాహెబ్ కుమారుడే సూరజ్ పంచోలీ. ఈ కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఏఎస్ సయ్యద్ గత వారమే తుది వాదనలు విన్నారు. జియా ఆత్మహత్య చేసుకునేలా సూరజ్ ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.