ఈ ఏడాది ‘మనశంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విజయోత్సాహంలో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. వెంకటేష్, కల్యాణ్‌రామ్ కలిసి నటించనున్న ఈ మల్టీస్టారర్ జూన్ నెలోలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. షైన్‌స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన హాస్యం, యాక్షన్ అంశాల కలబోతగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఇందులో ఓ కథానాయికగా కీర్తి సురేష్‌ను ఖరారు చేశారని, మరో నాయిక కోసం చిత్రబృందం అన్వేషణలో ఉందని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నటిస్తున్నారు వెంకటేష్. చిత్రీకరణ జరుగుతున్నది. ఇది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌లో వెంకటేష్ జాయిన్ కానున్నారు. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.