ముకుందన్ ఉన్ని అసోసియేట్స్
డిస్నీ హాట్స్టార్: జనవరి 13
తారాగణం: వినీత్ శ్రీనివాస్, సూరజ్, సుధీ కొప్ప
దర్శకత్వం: అభినవ్ సుందర్ నాయక్
జీవితంలో గెలవాలని కోరుకోవడం ఆశయం. ఎలాగైనా గెలిచి తీరాలి అనుకోవడం కసి. ఎదుటివారిని నాశనం చేసి మరీ విజయం సాధించడం స్వార్థం అవుతుంది. కరుడుగట్టిన స్వార్థపరుడిగా మారిన ఓ లాయరు కథే ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’. ముకుందన్ ఓ లాయర్. 36 ఏండ్లు వచ్చినా జీవితంలో స్థిరపడడు. వాదించడానికి ఒక్క కేసూ ఉండదు.
ఒకసారి ప్రమాద బీమాకు సంబంధించి తప్పుడు ధృవ ప్రతాలతో క్లయిమ్ చేస్తున్న వైనాన్ని చూస్తాడు ఉన్ని. వేగంగా డబ్బులు సంపాదించడానికి అది మంచి మార్గంగా అనిపిస్తుంది. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ సంస్థను స్థాపించి యాక్సిడెంట్ కేసుల తరఫున వకాల్తా పుచ్చుకొని క్లయిమ్స్ సెటిల్ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని ఉన్ని ఎలా ఎదుర్కొన్నాడు, అతని స్వార్థం ఎక్కడికి దారి తీసింది అన్నది మిగిలిన కథ. మలయాళంలో బ్లాక్బస్టర్ విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది.