హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్‌రెడ్డి దర్శకుడు. అచ్యుత్ రామారావు నిర్మాత. దీక్షిత్‌శెట్టి (‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు కీలక పాత్రధారులు. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇంద్రియవైకల్యంతో బాధపడే ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఈ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి చెవిటి వ్యక్తిగా, దీక్షిత్ మూగవాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపిస్తారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో విడుదలతేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం:
గరుడవేగ అంజి.