Mufasa The Lion King | బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హాలీవుడ్ విజువల్ వండర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పాడు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) అంటూ ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
లయన్ కింగ్ సినిమాకు ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ది లయన్ కింగ్ చిత్రం ఇండియాలో మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాకు తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లో అక్కడి నటులతో డబ్బింగ్ చెప్పించారు. ఇక తెలుగు లయన్ కింగ్ లోని సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పాడు. ఇదిలావుంటే తాజాగా వస్తున్న‘ముఫాసా: ది లయన్ కింగ్’ హింది వెర్షన్‌కు షారుఖ్ ఖాన్ తన గాత్రం దానం చేశాడు.
ఈ మూవీలో అడవి రాజు అయిన ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా.. తన కొడుకు సింబా పాత్రకు షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇక మూఫాసా చిన్నప్పుడు పాత్రకు షారుఖ్ చిన్న కొడుకు అబ్రామ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇక వీరే కాకుండా.. పుంబాకు సంజయ్ మిశ్రా టిమోన్కు శ్రేయాస్ తల్పాడే గాత్ర దానం చేశారు. తాజాగా హిందీ వెర్షన్ ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేసింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి రెండు (The Lion King) పార్ట్‌లలో అడవికి రారాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు అతడికి సోదరుడు ఉన్న టాకా ఎలా చనిపోయాడు. అలాగే ముఫాసా చంపాలని చూస్తున్నా స్కార్ ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమాకు అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.