MSG |మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను మరోసారి నిరూపిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ చిత్రం సాలిడ్ రన్ కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టింది. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఆదివారం వసూళ్లు కలుపుకొని ఈ చిత్రం రూ.300 కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్లో ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా $3 మిలియన్ల మైలురాయిని అధిగమించింది. దీంతో చిరంజీవి కెరీర్లోనే నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు మెగాస్టార్ ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ ($2.7 మిలియన్లు) ఉండగా, ఇప్పుడు ఆ రికార్డును ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్రేక్ చేసింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా పూర్తి రన్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్లో విడుదలై, కంటెంట్‌తో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ను పూర్తిగా క్యాష్ చేసుకుంటూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా విజేతగా నిలుస్తోంది.