MSG |మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, విడుదలైన నాటి నుంచి ట్రేడ్ వర్గాల అంచనాల్ని తలకిందులు చేస్తూ రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను విపరీతంగా ఆదరించడంతో థియేటర్లలో ఇప్పటికీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. చిరంజీవిని చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చూడటం ప్రేక్షకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్‌మార్క్ కామెడీ, మాస్ ఎలివేషన్స్, ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ కథను నడిపిన తీరు సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.
చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులు అభిమానులను మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించాయి. నయనతార గ్లామర్‌తో పాటు నటన సినిమాకు అదనపు బలంగా నిలిచింది. వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. విడుదలైన వెంటనే వచ్చిన పాజిటివ్ టాక్ ఓపెనింగ్స్‌ను భారీగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా కూడా భారీ స్థాయిలోనే జరిగింది.తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు: సుమారు రూ.105 కోట్లు, మొత్తం ఇండియా బిజినెస్: దాదాపు రూ.120 కోట్లు, ఓవర్సీస్ (ప్రత్యేకంగా నార్త్ అమెరికా): సుమారు రూ.20 కోట్లు. ఈ లెక్కల ప్రకారం వరల్డ్‌వైడ్ బ్రేక్ఈవెన్ రూ.140–150 కోట్ల మధ్యగా ఉండగా, సినిమా కేవలం ఆరు రోజుల్లోనే లాభాల బాట పట్టడం ట్రేడ్‌కు పెద్ద షాక్‌గా మారింది.
సినిమా మొదటి వారం నుంచే స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో పాటు వర్డ్ ఆఫ్ మౌత్ కలిసి కలెక్షన్లను భారీగా పెంచాయి. రెండో వారం వీక్‌డేస్‌లో స్వల్ప డ్రాప్ కనిపించినా, వీకెండ్‌కు మళ్లీ ఊపు రావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్టామినాను స్పష్టంగా చూపించింది.14 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.269 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇందులో ఇండియా మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ నుంచీ భారీ వసూళ్లు రావడం విశేషం. ఇప్పటికే మేకర్స్ రూ.350 కోట్ల మార్క్ దాటినట్లు అధికారికంగా ప్రకటించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.