అగ్ర నిర్మాతగా ఎన్నో భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు ఎమ్మెస్ రాజు. ‘డర్టీహరి’ ‘మళ్లీపెళ్లి’ వంటి సినిమాలతో దర్శకుడిగా కూడా రాణించారాయన. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన తారాగణం. మిస్టిక్ డివైన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. మైథలాజికల్, మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించాం. విజువల్ వండర్లా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తీశామని నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ వెంకటాపురం, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, నిర్మాణం: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్, దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.