MS Dhoni | స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇప్పటికే తన సతీమణి సాక్షితో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్మెంట్స్ తో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. హోం బ్యానర్ డెబ్యూ ప్రాజెక్ట్ ఎల్జీఎం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ధోనీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. విజయ్ (Vijay) దళపతి 67 (Leo)లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే ధోనీ లియోలో కనిపించడం లేదని ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరోసారి ధోనీకి సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సారి కూడా విజయ్ సినిమానే వార్తల్లో నిలవడం విశేషం. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న విజయ్ మరోవైపు దళపతి 68కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ ఏడాది కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో ఈ సినిమా రానుంది.
ఎంఎస్ ధోనీ ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. మరి ధోనీ ఎంట్రీ ఈ సారి పక్కానేనా..? ఈ న్యూస్ కూడా గాసిప్‌గానే మిగిలిపోతుందా..? లేదా..? అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. దళపతి 68 షూటింగ్ అక్టోబర్‌లో షురూ కానుందని తాజా టాక్. వెంకట్ ప్రభు టీం 2024 దీపావళి కానుకగా ఈ సినిమా రాబోతుందని హింట్ కూడా ఇచ్చేసింది. ఈ క్రేజీ చిత్రం పక్కా పొలిటికల్ జోనర్లో ఉండబోతుందట.
దళపతి 68లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.