Ms Dhoni | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది పై అభిమానుల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసినా.. ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదనే అసంతృప్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఇంకా సరైన ప్రమోషన్స్ ఎందుకు మొదలుపెట్టలేదు?” అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విమర్శలకు సమాధానంగా మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రత్యేకంగా నార్త్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టిన మేకర్స్, అక్కడ సినిమాకు మరింత బజ్ తీసుకురావడానికి ఓ మైండ్ బ్లాకింగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యం కూడా సినిమాలో కీలక భాగంగా ఉండటంతో, ఆ స్పోర్ట్స్ ఎమోషన్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌లోని రాంచీలో భారీ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆ ఈవెంట్‌కు భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈ విషయంపై సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నాయని, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది. ఒకవేళ నిజంగానే ధోనీ ఈ ఈవెంట్‌కు హాజరైతే, ‘పెద్ది’ ప్రమోషన్స్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారే అవకాశముంది. ఇక రామ్ చరణ్‌కు నార్త్ ఇండియాలో ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ఉపయోగించుకుని ‘పెద్ది’ని పాన్ ఇండియా స్థాయిలో మరింత బలంగా తీసుకెళ్లాలని మేకర్స్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో క్రీడలతో పాటు బలమైన ఎమోషన్స్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని టాక్. బుచ్చిబాబు సానా గతంలో తెరకెక్కించిన ఉప్పెన భారీ విజయాన్ని అందుకోవడంతో, ‘పెద్ది’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.