Mrunal Thakur | బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్ (ZEE STUDIOS), భన్సాలీ ప్రొడక్షన్స్ (BHANSALI PRODUCTIONS) కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి ‘దో దీవానే షెహర్ మే’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. ఇందులో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ జంటగా నటించబోతున్నారు. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంకి రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తుండగా.. సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భరత్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి అనౌన్స్మెంట్ వీడియోను పంచుకుంది చిత్రయూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మెట్రో లవ్‌స్టోరీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.