మృణాల్ ఠాకూర్ మనసు గాయపడింది. ఈ గాయానికి మీడియా వాళ్లే కారణమట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్. ‘రీసెంట్గా ఓ అవార్డు వేడుకకు నేనూ జాన్వీ కపూర్ హాజరయ్యాం. ముందుగా నేను ఆ వేడుకలోకి అడుగుపెట్టా. నన్ను చూడగానే మీడియా వాళ్లంతా చుట్టుముట్టారు. ఊపిరాడనీయకుండా ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా. ఇంతలో జాన్వీ లొకేషన్లోకి ఎంటరయ్యింది. అంతే.. నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరిగెత్తారు. ఊహించని ఆ సంఘటన నా మనసుని ఎంతో బాధించింది. అవమానంగా ఫీలయ్యా. పరిశ్రమలో వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత నాలా కష్టపడి పైకొచ్చిన వాళ్లకు ఉండదు. జాన్వీలా నేను స్టార్కిడ్ని కాదు కదా.’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్.