‘డెకాయిట్’కి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. హిందీలో కూడా సినిమాను బాగా చూస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళంలో డబ్ చేశాం. ఆ రాష్ర్టాల్లోనూ స్పందన బావుంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. యూఎస్‌లో కూడా మిలియన్ దాటేసింది. మొత్తంగా అనుకున్న విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని నిర్మాత యార్లగడ్డ సుప్రియ అన్నారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో ఆమె నిర్మించిన ఎమోషనల్ యాక్షన్ లవ్‌డ్రామా ‘డెకాయిట్’.
ఇటీవల విడుదలైన ఈచిత్రం గురించి సోమవారం హైదరాబాద్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరులతో మాట్లాడారు. ‘దాదాపు అందరూ కొత్తవాళ్లతో చేసిన సినిమా ఇది. చివరికి డీవోపీ కూడా కొత్తే. వీరందరితో డిఫరెంట్ లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేయడం ఛాలెంజ్‌గా అనిపించింది. ఒక్కోసారి రెండొందలమందిని ఒకచోటకు చేర్చి షూట్ చేయాల్సివచ్చేది’ అని గుర్తుచేసుకున్నారు సుప్రియ. ‘డెకాయిట్’ కథకు ైక్లెమాక్స్ హార్ట్ లాంటిదని, చాలామంది ైక్లెమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారని, ముఖ్యంగా అడివి శేష్, మృణాల్ క్యారెక్టర్లకు ఆడియన్స్ బాగా కనెక్టయ్యారని సుప్రియ చెప్పారు.
ఎస్.ఎస్.క్రియేషన్స్‌పై ఇకనుంచి సినిమాలు చేయాలనుకుంటున్నానని, ప్రేమకథలు, ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేసే ‘డెకాయిట్’ లాంటి కథలు తీయడం తనకిష్టమని, ప్రేమ, త్యాగం, ద్రోహం, మోసం లాంటి ఎమోషన్స్ మన క్లాసిక్స్ ప్రేమకథల్లో ఉంటాయని, అలాంటి కథలతో సినిమాలు చేయాలనుందని, బలమైన ఫీమేల్ ఫార్వార్డ్ క్యారెక్టర్‌తో సినిమా చేయాలనేది తన కోరికని, ‘డెకాయిట్’తో ఆ కోరిక కొంతవరకు నెరవేరిందని సుప్రియ చెప్పారు.