Mrunal Takhur | సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ డిప్రెషన్‌తో పోరాడినట్టు చెప్పుకొచ్చింది. ఒకసారి లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని కూడా ఆలోచించానని చెప్పారు. అయితే పేరెంట్స్ గుర్తొచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం మృణాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మృణాల్‌కి చిన్నతనంలోనే నటనపై ఆసక్తి కలగడంతో మొదట సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తెలుగు సినిమా ‘సీతారామం’లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో, హిందీలో కలిపి సుమారు అరడజను సినిమాలు చేస్తుంది.. ఇందులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’, అల్లు అర్జున్, అట్లీతో కలిసి పనిచేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. అడివి శేష్ డెకాయిట్ సినిమాలో ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా మృణాల్ ఆ ఛాన్స్ దక్కించుకుంది. డెకాయిట్ ఒక్కటే తెలుగులో మృణాల్ కి ఉన్న ఆఫర్. ఆ సినిమా డిసెంబర్ కి రిలీజ్ అవుతుంది. అయి తే తెలుగుతో పాటు హిందీలో వచ్చిన ప్రతి సినిమాకి ఓకే చెబుతుంది మృణాల్ ఠాకూర్.
ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసి డిప్రెషన్‌తో ఇబ్బంది పడ్డా, ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఘన విజయాలు సాధించిన మృణాల్ ఠాకూర్ తన బలాన్ని, పట్టుదలని ప్రదర్శిస్తూ కొత్త పాత్రల్లో మరింత మెరుగైన నటన చూపిస్తున్నారు.ఆమె రానున్న రోజులలో మరింత ఎత్తుకి ఎదగాలని, జీవితంలో మరోసారి అలాంటి పిచ్చి ఆలోచనలు దగ్గరకు రానివొద్దని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు.