Peddi | ‘పెద్ది’ ఐటెం సాంగ్‌లో మృణాల్ ఠాకూర్.. రామ్ చరణ్‌తో స్పెషల్ డ్యాన్స్‌కు సిద్ధమా?
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మిగిలి ఉన్న కీలక అంశాల్లో ఒకటైన ఐటెం సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మిగిలి ఉన్న కీలక అంశాల్లో ఒకటైన ఐటెం సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సన స్పెషల్ సాంగ్ కోసం సరైన హీరోయిన్ ఎంపికపై కొంతకాలంగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మొదట ఈ పాటలో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్లను తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో ఆ ప్లాన్‌ను విరమించుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన నటించేందుకు మృణాల్ ఠాకూర్‌ని ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఈ వార్త కొద్దిరోజుల క్రితమే వినిపించినా, అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇటీవల మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియజేసే పోస్టులు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఆమె ‘పెద్ది’ పాట షూట్ కోసమే నగరానికి వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక మృణాల్ ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్లతో కూడా బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఆమె డేట్లను టీమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. ఈ ప్రమోషన్ల మధ్యలో లభించే గ్యాప్‌లోనే ‘పెద్ది’ ఐటెం సాంగ్ షూట్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ పాటలో మృణాల్ ఠాకూర్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా కనిపించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా నుంచి టీజర్ లేదా ట్రైలర్ రూపంలో స్పెషల్ అప్డేట్ ఇవ్వొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా, ‘పెద్ది’ సినిమా వాయిదా పడుతుందనే ప్రచారాలకు చిత్రబృందం ఇప్పటికే చెక్ పెట్టింది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండగా, బిజినెస్ వ్యవహారాలు కూడా క్రమంగా పూర్తి అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల తేదీ మిస్ కాకూడదనే పట్టుదలతో యూనిట్ పగలు రాత్రి శ్రమిస్తోంది. రెహమాన్ అందుబాటులోకి రాగానే సెకండాఫ్ రీ-రికార్డింగ్ పనులు వేగవంతం కానున్నాయి. మొత్తం మీద అన్ని పనులు ప్లాన్ ప్రకారం సాగుతున్న నేపథ్యంలో ‘పెద్ది’ విడుదల వాయిదా పడే అవకాశాలు లేవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

