నరేష్ ఆగస్త్య, డోనల్ బిష్ట్ జంటగా నటించిన చిత్రం ‘ఎమ్ఆర్పీ-నీకెంత నాకెంత’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రవణ్ జేష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని దర్శకనిర్మాత శ్రవణ్ జేష్ఠ తెలిపారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరో నరేష్ ఆగస్త్య అన్నారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, రాజ్‌కుమార్, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాణం, దర్శకత్వం: శ్రవణ్ జేష్ఠ.