Mr Bachchan | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన సితార్ సాంగ్ ప్రోమో ఇంప్రెసివ్‌గా సాగుతోంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీలో అందమైన లొకేషన్లలో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని అయిన రవితేజ తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో కథానుగుణంగా రవితేజ అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడట.
సితార్ లిరికల్ వీడియో సాంగ్..