Mr Bachchan |హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా మరో సినిమా వస్తుందని తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు.
కాగా ఇప్పుడీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 28 నుంచి హైదరాబాద్‌లో షురూ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను రవితేజ టీం వెల్లడించనుందని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ ఓ వైపు ఈగల్ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే.. మరోవైపు మిస్టర్ బచ్చన్ షూటింగ్‌తో బిజీ కానున్నాడన్నమాట. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని అని తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సినిమాకు మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపిస్తారని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్ శంకర్.