మిరపకాయ్, గబ్బర్‌సింగ్, గద్దలకొండ గణేశ్.. ఈ మూడు సినిమాలు చాలు దర్శకుడిగా హరీశ్‌శంకర్ సామర్థ్యం ఏంటో చెప్పుకోటానికి. మాస్ హీరోలను మాస్ మహారాజుల్లా చూపించడంలో హరీశ్ దిట్ట. రవితేజ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భారీ అంచనాలతో ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హరీశ్‌శంకర్ విలేకరులతో ముచ్చటించారు.