Mowgli |యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా నటించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 12, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
సినిమా విడుదలైన తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్‌ను దాటడం విశేషం. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మోగ్లీ’, థియేట్రికల్‌తో పాటు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం దాదాపు రూ.10 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకు లాభాలు అందించిన సినిమాగా ‘మోగ్లీ’ నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.రోషన్ కనకాల నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యంగ్ హీరోగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చూపిన ఎనర్జీ ఆకట్టుకుంటున్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ చేసిన నటన సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఆయన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్కు ప్రత్యేకంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
లవ్, యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో తెరకెక్కిన ‘మోగ్లీ’ యువతను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది. ఈ విజయంతో రోషన్ కనకాల కెరీర్‌కు మంచి బూస్ట్ లభించినట్టుగా టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండో సినిమాతోనే లాభాల బాట పట్టిన హీరోగా రోషన్ పేరు నిలవడం విశేషం. మొత్తానికి తనయుడు సినిమా మంచి హిట్ కొట్టడంతో సుమతో పాటు రాజీవ్ కనకాల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.