Roshan Kanakala | యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తొలి సినిమా ‘బబుల్ గమ్’ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్, ఈసారి పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘మోగ్లీ’ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాలని కోరుకుంటున్నాడు.ఈ సినిమాకి ‘కలర్ ఫోటో’ ఫేం సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా మేకర్స్ ఆసక్తికరమైన అప్డేట్ను షేర్ చేశారు.
మూవీ మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల చేయించనున్నామని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ.. ఒక చిన్న వీడియో కూడా విడుదల చేశారు. ఒక చిన్న ప్రేమ కథ చెప్తానంటూ వీడియోని విడుదల చేయగా, ఇది ఆకట్టుకుంటుంది. ఇక మోగ్లీకి సంబంధించిన పోస్టర్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అటవీ నేపథ్యంపై ఆధారపడి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ‘మోగ్లీ’ అనే టైటిల్‌తో, జంగిల్ బుక్ పాత్రను రిఫరెన్స్‌గా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రంలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా కావడం విశేషం.ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవ పనిచేస్తున్నారు, అంటే మ్యూజికల్ గానూ మంచి ట్రీట్ ఎదురవుతుంది.‘బబుల్ గమ్’ విజయవంతం కాకపోయినా, రోషన్‌కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘మోగ్లీ’తో తన ఫస్ట్ కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.దర్శకుడు సందీప్ రాజ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లు తెరకెక్కించడంలో నిపుణుడిగా పేరు పొందిన నేపథ్యంలో, ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఒక చిన్న ప్రేమ కథ చెప్తా ❤️🔥🐎
‘𝐓𝐇𝐄 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 𝐌𝐎𝐖𝐆𝐋𝐈’ glimpse, narrated by the one and only Natural Star @NameisNani Garu ⭐
Out on 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟗𝐭𝐡, 𝐅𝐑𝐈𝐃𝐀𝐘 at 4.05 PM 🤩
A @SandeepRaaaj directorial.
🌟ing @RoshanKanakala & #SakshiMhadolkar
A… pic.twitter.com/JD5c7CpDFZ— People Media Factory (@peoplemediafcy) August 26, 2025